Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్‌పై నిలదీసినందుకు డ్యూటీలో లేని పోలీస్ కానిస్టేబుల్‌పై ఐదుగురు యువకులు దాడి చేశారు. తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల అశోక్, అస్తంపట్టి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డ్యూటీలో లేని అతడు రాత్రి వేళ బైక్‌పై వెళ్తున్నాడు. అయితే ఒక బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తున్నారు. దీంతో అశోక్ తన బైక్‌ను ఆపి దీనిపై వారిని నిలదీశాడు. ఈ నేపథ్యంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అశోక్‌పై దాడి చేశారు. మరో ఇద్దరు అనుచరులు కూడా అక్కడకు వచ్చి ఆయనను కొట్టారు. మరోవైపు ఇది చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అశోక్‌పై దాడి చేసిన వారిలో నలుగురిని పట్టుకున్నారు. ఈ విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులను అబ్దుల్ రెహమాన్, రికాన్‌పాషా, అస్లాం అలీ, రిజ్వాన్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పారిపోయిన ఐదో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. కౌన్సిలర్ సదాజ్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ అని పోలీసులు తెలిపారు.