Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ట్విట్టర్ లో తనను సాయం కోరిన ఓ పేద క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు.
నల్గొండ జిల్లా చండూర్ మండలం బంగారి గడ్డ గ్రామానికి చెందిన నజియా హకీంపేటలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఆమె అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి ఆటలో బాగా రాణిస్తోంది.
ఇటీవల లండన్ లో జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ లో కాంస్య పతకం, టీమ్ విభాగంలో మరో కాంస్యం గెలిచింది. నజియా తండ్రి ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. తక్కువ వేతనంలో ముగ్గురు పిల్లలను పోషించడం ఆయనకు కష్టంగా మారింది. ఈ విషయాన్ని నదియా ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చింది. అందుకు కేటీఆర్ కూడా స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు నజియా ఇంటికి వెళ్లి స్పోర్ట్స్ కిట్ ను, రూ. 50 వేల నగదును అందించారు.