Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. బర్రెదూడపై 38 ఏండ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం తెలిపారు. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం పూణెలోని దక్కన్ ప్రాంతంలో బర్రెదూడపై నెపాల్ కు చెందిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. దాంతో నిందితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం అతన్ని సాసూన్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
స్థానికులు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 (అసహజ సెక్స్), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని దక్కన్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.