Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి పర్సోత్తమ్ రూపాల తెలిపారు. ప్రధాన నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నాయకత్వంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పాటేల్ శనివారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు సంఘ్వి చెప్పారు. గుజరాత్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఉమ్మతి పౌరస్మృతి అమలు అవసరాన్ని కమిటీ పరిశీలించి, ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఒక ట్వీట్‌లో తెలిపారు.