Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సమంత తన అనారోగ్యం గురించి ఓపెన్ అయ్యింది. మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్ ఎక్కుతుండగా.. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది. దీంతో సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. సమంతా త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ధైర్యంగా ఉండాలని సూచించారు. అటు హీరోయిన్స్ కాజల్, శ్రీయ, అనుష్క, అతియా శెట్టి, రుహాని శర్శ, మాళవిక నాయర్, రాశీ కన్నాలతో పాటు మంచు లక్ష్మీ, సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యం చెప్పారు. స్ట్రాంగ్‌గా ఉండాలని సూచించారు. కాగా తన వ్యాధి గురించి పెట్టిన పోస్ట్‌ను ఉద్వేగ భరింతంగా రాసుకొచ్చారు సమంత. జీవితం తనకు అనేక సవాళ్లు విసురుతోందని, అదే సమయంలో ప్రేక్షకులు చూపే ప్రేమ వాటిని అధిగమించే శక్తిని ఇస్తోందని పోస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాంతకమైన మయోసిటిస్ అనే వ్యాధి ఉందనే విషయం తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే తాను పూర్తిగా కోలుకోగలనని డాక్టర్లు చెప్పారని సమంత పోస్ట్ చేశారు.