Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భయాందోళనలో ప్రజలు
నవతెలంగాణ రాజంపేట్
కామారెడ్డి జిల్లాలో కుక్కలకు విచిత్ర వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. రాజంపేట మండల కేంద్రంతోపాటు ఆరేపల్లి గ్రామంలో విచిత్ర వ్యాధితో కుక్కలు ఇబ్బందుల పడుతున్నాయి. కుక్కల వెంట్రుకలు పూర్తిగా పోయి గజ్జి లేచినట్టుగా విచిత్రమైనవ్యాధితో ఇబ్బంది పడుతున్నాయి. వాటి చర్మం నుంచి రక్తస్రావం జరుగుతుంది. గ్రామంలోని వీధులలో ఈ వ్యాధితో కూడిన కుక్కలు సంచారించడంతో తమకు ఎలాంటి వ్యాధులు కలుగునో అని గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. వెంటనే గ్రామపంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.