Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహాన్ని రాజస్థాన్‌లో శనివారం ఆవిష్కరించారు. రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాం 'విశ్వాస స్వరూపం` విగ్రహాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బోధకుడు మొరారీ బాపు, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సిపి జోషితో కలిసి ఆవిష్కరించారు. ఉదయ్‌పూర్‌కు 45 కిలోమిటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహంగా ఖ్యాతి పొందనుంది. నేటి నుంచి నవంబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మురారి బాపు రామ్ కథను వినిపించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 'రామ్ కథ ప్రతి సందర్భం ప్రేమ, సామరస్యం మరియు సోదరభావం సందేశాన్ని ఇస్తుంది, ఇది ఈ రోజు దేశంలో చాలా అవసరం. అలాంటి కథలు దేశంలో ప్రతిచోటా నిర్వహించాలి.. నిర్వహించడం జరుగుతుంది` అని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురు రామ్‌దేవ్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
51 బిఘాల కొండపై నిర్మించబడిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంది మరియు 20 కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తుంది. ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలిగించడంతో రాత్రిపూట కూడా ఈ విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహాన్ని నిర్మించడానికి 10 సంవత్సరాలు పట్టింది. నిర్మాణంలో 3,000 టన్నుల ఉక్కు మరియు ఇనుము మరియు 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు మరియు ఇసుకను ఉపయోగించారు. 2012 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాట్, మొరారీ బాపు సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.