Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశాడు. పచ్చ కామెర్లతో చెన్నైలోని ఓ ప్రైయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మరణవార్త తెలిసి కోలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలిసి పలువురు రఘురామ్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల పచ్చ కామెర్ల బారిన పడిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ చికిత్స తీసుకుంటున్నాడు. అయినప్పటికీ తక్కువ సమయంలోనే జాండిస్ వ్యాధి ముదిరింది. ఒళ్లంతా పాకింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటున్న రఘురామ్.. శనివారం ప్రాణాలు విడిచాడు. 2017లో వచ్చిన ఒరు కిడియాన్ కరుణై మను చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు రఘురామ్. ఆ సినిమాకు రఘురామ్ ఇచ్చిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత రివైండ్, ఆసాయి సినిమాలకు కూడా సంగీతం అందించాడు. ప్రస్తుతం సాథియా సొథనై సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రఘురామ్ అకస్మాత్తుగా మరణించడం అందర్నీ కలిచివేస్తోంది.