Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ శనివారం (అక్టోబరు 29) విడుదలైంది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (OMR డిజిటల్ కాపీలను) కూడా అధికారిక వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. నవంబరు 29 వరకు అభ్యర్థుల OMR పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కీ ఆధారంగా అభ్యర్థులు తాము నమోదుచేసిన సమాధానాలు చెక్ చేసుకోవచ్చు.మార్కులపై ఓ అంచనాకు రావచ్చు. గ్రూప్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు.
ఆన్సర్ కీ, OMR షీట్ల కోసం క్లిక్ చేయండి..
ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలున్నవారు అక్టోబరు 31 నుంచి నవంబరు 4న సాయంత్రం 5 గంటల వరకు తమ అభ్యంతరాలకు తెలపవచ్చు. ఇందుకోసం ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాకుంటే రెండు, మూడు రోజుల్లో ఫైనల్ కీ ని ప్రకటించనుంది. ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది. మొత్తం 503 పోస్టుల్లో ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.