Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దీపావళి నుంచి గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజిమెంట్ తక్షణ చర్యలకు దిగింది. నేషనల్ క్యాపిటిల్ రీజియన్ లో భవన నిర్మాణాలు, కూల్చివేత కార్యక్రమాలపై నిషేధం విధించింది. తక్షణం ఈ నిషేధం అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఎయిర్ క్వాలిటీ మరింత దిగజారకుండా స్టేజ్-3 గ్రేడెడ్ రెస్పాన్ యాక్షన్ ప్లాన్ అమలుకు కమిషన్ ఆదేశించింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గత శుక్రవారం నుంచి పడిపోతుండటం అధికారులలో ఆందోళన రేపింది. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు పిల్లల్లో కళ్ల మంటలు సమస్యలు తలెత్తాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జీరో నుంచి 50 వరకూ ఉంటే నాణ్యతతో ఉన్నట్టు పరిగణిస్తారు. 51 నుంచి 100 వరకూ సంతృప్తికరంగా ఉన్నట్టు లెక్కిస్తారు. 101 నుంచి 200 వరకూ ఉంటే 'మోడరేట్'గా, 201 నుంచి 300 వరకూ దయనీయంగా, 301 నుంచి 400 వరకూ మరింత దయనీయంగా పరిగణిస్తారు. 401 నుంచి 500 వరకూ ఉన్నప్పుడు తీవ్ర పరిస్థితిగా పరిగణిస్తుంటారు. గత శుక్రవారం నుంచి ఆనంద్ విహార్ వంటి ప్రాంతంల్లో ఎయిర్ క్వాలిటీ Severe కేటగిరిలో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీ మొత్తంగా శుక్రవారం ఎయిర్ క్వాలిటీ 309కి చేరుకోవడంతో ఏక్యూఐ బాగా దిగజారినట్టు గుర్తించారు.