Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సమ్మెటివ్ అసెస్మెంట్-1(ఎస్ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ శనివారం సవరించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నవంబరు 9-16 తేదీల్లో ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. సవరించిన తేదీలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆదేశించింది. గతంలో ఈ పరీక్షలను నవంబరు 1-7 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.