Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: రైల్వేబోర్డు చైర్మన్, సీఈవో వినయ్‌కుమార్ త్రిపాఠి శనివారం నగరంలో దక్షిణరైల్వే జనరల్ మేనేజర్ బీజీ మాల్యా, చెన్నై, సేలం, తిరుచ్చి, మదురై, పాలక్కాడ, తిరువనంతపురం డివిజనరల్ రైల్వే మేనేజర్‌లతో భేటీ అయ్యారు. దక్షిణరైల్వే పని తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు దక్షిణరైల్వే పని తీరు విశేషాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. దక్షిణరైల్వేలోని గేజ్ మార్పిడి, డబ్లింగ్, విద్యుద్దీకరణ, దక్షిణరైల్వేలోని 9 స్టేషన్ల అభివృద్ధి, రోడ్డు భద్రతా పనులు, రైళ్ల వేగం పెంపు, భారత్ గౌరవ్ రైళ్ల ప్రవేశం, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలను వివరించారు. వాటన్నింటి వివరాలు తెలుసుకున్న చైర్మన్.. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకు ముందు ఉదయం ఆయన ఉన్నతాధికారులతో కలిసి కొరుకుపేట గూడ్స్‌షెడ్‌ను పరిశీలించారు. తరువాత ఇన్సులేటర్ల హాట్‌లైన్ క్లీనింగ్‌ను పరిశీలించారు. అనంతరం చెన్నై సెంట్రల్ స్టేషన్‌ను పరిశీలించిన ఆయన.. హాటల్‌లైన్ పర్యవేక్షణలో ఉపయోగించే ‘ప్రకృతి’ అనే ట్విన్ కోచ్ టవర్ కారును తనిఖీ చేశారు. అది పని చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం చెన్నై సబర్బన్ టెర్మిన్‌సలో కొత్తగా ప్రారంభించిన కాంచీపురం శిల్క్ శారీ స్టాల్‌ను సందర్శించి వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే విధంగా రైల్వే కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ సమావేశమై వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అనంతరం వాలాజా రోడ్, తలంగై, ఆరంబాక్కం, తడ, పెదపరియ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన కొత్త ఎలక్ర్టానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను, మల్టీ సెక్షన్ డిజిటల్ యాక్సిల్ కౌంటర్ తదితరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.