Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దపల్లి: గర్భిణికి పురిటినొప్పులు ఎక్కువవ్వడంతో బెంగళూరు నుంచి యశ్వంత్‌పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. వివరాల్లోకెళ్తే.. రైలులో ప్రయాణిస్తుండగా వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో ఆమె కుటుంబీకులు విషయాన్ని టీటీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో.. వారు 108కు కాల్ చేశారు. ఈ నేపథ్యంలో రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగింది. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో సిబ్బంది ఆమెకు అంబులెన్స్‌లోనే పురుడుపోశారు. అనంతరం తల్లీ పిల్లలను పెద్దపల్లి మాతాశిశు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు