जब रेस लगाई राहुल गांधी ने...#BharatJodoYatra pic.twitter.com/iJtd3fOcYW
— Congress (@INCIndia) October 30, 2022
Authorization
जब रेस लगाई राहुल गांधी ने...#BharatJodoYatra pic.twitter.com/iJtd3fOcYW
— Congress (@INCIndia) October 30, 2022
హైదరాబాద్ : భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్రలో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ వద్దకు కొంతమంది చిన్నారులు రాగా.. ఆయన 'మనం పరుగెదామా.. రెడీ వన్ టు త్రీ` అంటూ ఆయన పరుగెత్తడం మొదలు పెట్టారు. వెంటనే, పిల్లలు, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మిగతా నాయకులు, భద్రతా సిబ్బంది కూడా పరిగెత్తారు. అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత పరుగు ఆపిన రాహుల్ మళ్లీ నడవడం కొనసాగించారు. రాహుల్ నేడు 22 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సాయంత్రం గాంధీ షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద సభలో పాల్గొంటారు.