Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీబీఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ను జారీచేసింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా సీబీఐకు గతంలో అనుమతి ఉండేది. ఇకపై తెలంగాణలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.