Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : పండుగకు తల్లిదండ్రులు ఇంటికి రావద్దన్నారని నారాయణ కళాశాలలోని హాస్టల్ లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం,తెట్టంగి గ్రామానికి చెందిన పొట్నూరు లక్ష్మణరావు, సుమతి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు శరణి, ముఖేష్ ఉన్నారు. ముఖేష్ ఈ ఏడాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని వెల్లంకిలో ఉన్న నారాయణ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు. ముఖేష్ శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసి అందరూ నాగులచవితికోసం ఇంటికి వెళ్తున్నారని తమ గదిలో నలుగురు విద్యార్థులమే మిగిలామని.. తాను కూడా ఇంటికి వస్తానని కోరాడు. అయితే అందుకు తల్లి దండ్రులు అంగీకరించారు. దాంతో మనస్తాపం చెందిన ముఖేష్ రాత్రి హాస్టల్‌లో నిర్వహిస్తున్న స్టడీ అవర్ సమయంలో మధ్యలోనే తన గదిలోకి వెళ్లిపోయాడు.అక్కడ చేతిపై లైఫ్‌నిల్ అని రాసుకుని నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గమనించిన కళాశాల సిబ్బంది ముఖేష్‌ను తగరపువలసలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. కేసును ఎస్‌ఐ నరసింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.