Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ఇటీవలే ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. వచ్చి రగానే ఉన్నతాధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గడ్డె సహా పలువురిని తొలగించారు. ఇక సంస్థ లో పనిచేస్తున్న 7,500 మంది ఉద్యోగులలో సుమారు 75 శాతం మందిని తొలగించాలని తాజాగా ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరెవరిని తొలగించాలో జాబితా సిద్ధం చేయాలని సంస్థ మేనేజర్లను మస్క్ ఆదేశించినట్లు సమాచారం. నవంబర్ 1లోగా తొలగింపు ప్రక్రియను పూర్తిచేయాలని భావించినట్లు తెలుస్తోంది. అలాగే ట్విట్టర్ సీఈఓగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ హెడ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నారని బ్లూమ్‌బర్గ్ కూడా వెల్లడించింది. ఇప్పటికే టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలకు అధినేతగా మస్క్ వ్యవహరిస్తున్నారు.