Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలోని రిసార్ట్స్ లో ట్రెజర్ హంటు గేమ్ ఆడుతూ ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు శనివారం సాయంత్రం గోధుమ గుడాలోని మూన్ లైట్ రిసార్ట్స్ కి చేరుకున్నారు. అక్కడ వారు ట్రెజర్ హంట్ అనే ఆట ఆడారు. పారేసిన వస్తువును తీసుకురావడమే ఈ ఆట లక్ష్యం. ఈ మేరకు రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టడంతో ఓ వ్యక్తి బావిలో దూకి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.