Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిస్బేన్ : టీ 20 ప్రపంచకప్ లో సూపర్ 12లో భాగంగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో జింబాబ్వే పై బంగ్లాదేశ్
3 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్ ముల్ హుస్సేన్ షాం(55 బంతుల్లో 71 పరుగుల) చెలరేగి ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగ్రవ, బ్లెస్సింగ్ ముజరబాని చెరో రెండు వికెట్లు తీశారు. రాజా, సియన్ విలియమ్స్ తలో వికెట్ తీసుకున్నారు.
151 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుతిరిగారు. సీన్ విలియమ్స్ (42 బంతుల్లో 64 పరుగులు) రాణించాడు. చివరి ఓవర్ లో 16 పరుగులు అవసరం కాగా 12 పరుగుల మాత్రమే జింబాబ్వే చేయగలిగింది. ఈమేరకు జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దాంతో3 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, మొసద్దిక్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో జింబాబ్వేను కట్టడి చేశారు.