Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును పోలీసులు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు సుల్తానా, షరీఫ్, జావేద్‌ల నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిందితులు వారి అండర్‌వేర్‌లలో బంగారాన్ని దాచిపెట్టారని తెలిసింది. దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు.. అక్కడ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.