Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద : ట్విట్టర్ ను ఇటీవలె ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ సేవను ఆయన అన్వేషిస్తున్నారని పీపుల్ మ్యాగజైన్ పేర్కొంది. మస్క్ సంస్థ నియంత్రణను స్వీకరించడానికి సరిగ్గా ఒక వారం ముందు, డోర్సే తన వికేంద్రీకృత సామాజిక ప్లాట్‌ఫారమ్ బ్లూస్కీ కోసం బీటా టెస్టర్‌ల కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. బ్లూస్కీని 2019లో స్థాపించారు. నవంబర్ 2021లో, డోర్సే ట్విట్టర్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. మే 2022లో, అతను డైరెక్టర్ల బోర్డు నుండి రాజీనామా చేశారు. దీంతో డోర్సే తన కాన్సెన్ట్రేషన్ మొత్తం బ్లూస్కీ మీద పెట్టాడని చెబుతున్నారు. కొత్త సోషల్ మీడియా సైట్ కు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయివేటు బీటాలో ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. బీటా వెర్షన్ పరీక్ష చేసి.. ఎలా పని చేస్తుందనే దాని గురించి వివరాలను పంచుకుంటామని డోర్సే టీమ్ తెలిపింది.