Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చేవెళ్ల, వికారాబాద్, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నారనే వార్తలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఖండించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ పార్టీ అని, దళితులను అవమానించిన పార్టీ అని మండిపడ్డారు. చేవెళ్ల ప్రాంతంపై బీజేపీ నాయకుల చేసిన విషప్రచారాన్ని ఎవరూ నమ్మబోరన్నారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇలాంటి బూటకపు విషప్రచారం చేస్తే బీజేపీ నేతలపై దాడులు చేయకతప్పదని హెచ్చరించారు.