Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నటి సమంత మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందుకు చికిత్స తీసుకుంటున్నట్టు సమంత శనివారం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాంతో ఆమెకు పలువురు సెలబ్రిటీలు సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు. కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయని, మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయన్నారు. సమంత ఒక అద్భుతమైన అమ్మాయని, అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుందని చెప్పారు. సమంత అతి త్వరలోనే అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమంత ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.