Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇస్రో ఇటీవల విజయవంతంగా ఉపగ్రహాలను పంపించడంతో అంతర్జాతీయ వాణిజ్య విపణిలో భారత దేశం బలమైన పోటీదారుగా నిలిచిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్` రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇస్రో పదేండ్ల క్రితం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ప్రాజెక్టును విజయవంతం చేసిందని గుర్తు చేశారు. క్రయోజెనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్‌వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు. అంతకుముందు దశాబ్దాలపాటు మన దేశంపై అమెరికా, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఆంక్షలు అమలవుతూ ఉండేవని చెప్పారు. క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని మన దేశానికి ఇచ్చేందుకు ఇతర దేశాలు గతంలో తిరస్కరించాయని, ఆ తర్వాత భారతీయ శాస్త్రవేత్తలు మన దేశంలోనే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తాజాగా దీపావళికి ముందు 36 కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. మరో 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను త్వరలోనే ప్రయోగించబోతోందన్నారు.