Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సాధారణంగా పెండ్లీల సమయంలో బారత్ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగడం మనం చూస్తుంటాం. అయితే ఓ పెండ్లి కొడుకు గుర్రం అందుబాటులో లేకపోవడంతో గాడిదపై ఊరేగింపుగా వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుడు గాడిదపై కూర్చొని ఉంటాడు. అతడి బంధువులు దాని ముందు డ్యాన్సులు చేస్తున్నారు. మహిళలు కూడా హారతులు ఇస్తున్నారు. అనంతరం వరుడు ఆ గాడిదపై ఊరుగుతూ పెండ్లి మండపానికి చేరుకుంటాడు.