Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వడోదర : దేశంలో ప్రయివేటు రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ. 22,000 కోట్లు. టాటా-ఎయిర్‌బస్ కన్సార్షియం దీనిని ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ సీ-295 విమానాలను తయారు చేస్తారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడానికి భారీ అడుగులు వేస్తున్నాముు అని తెలిపారు. భారతదేశం యుద్ధ విమానాలు, వ్యాక్సిన్‌లను తయారు చేస్తోందని... మేడ్-ఇన్-ఇండియా మొబైల్స్, కార్లు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని ఆయన అన్నారు. ఏరోస్పేస్ రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడి అని.. వడోదర ఏవియేషన్ సెక్టార్ హబ్‌గా మారుతుందని అన్నారు.