Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తది అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 'ఈ మునుగోడు ఉప ఎన్నిక అవసరం లేకుండానే వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎప్పుడో తేల్చేశారు అది కూడా తెలుసు. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఒక నాలుగు విషయాలు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎలక్షన్లు వస్తాయి. ఎన్నికలు రాగానే ఏందో ఏమో మాయరోగం పట్టుకుంటుంది. విచిత్ర వేషాధారులు, అనేక పార్టీలు వస్తాయి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాటలను ఇక్కడనే వదిలేసి వెళ్లిపోవద్దు. మీ ఊరెళ్లిన తర్వాత చర్చ చేసి నిజనిజాలు తేల్చాలి. ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే.. ఒళ్లు మరిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడ్తది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తది. కరిచే పాము అని చెప్పి మెడలో వేసుకుంటామా? ఆలోచించాలి.