Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెర్త్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (9), కెప్టెన్ రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (12), దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా (2) తక్కువగా స్కోరుకే అవుటయ్యారు. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి 4 వికెట్లు తీసి టీమిండియా టాపార్డర్ ను హడలెత్తించాడు. ఆన్రిచ్ నోక్యా ఓ వికెట్ తీశాడు. ప్రస్తుతం టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (17), దినేశ్ కార్తీక్ (1) క్రీజులో ఉన్నారు.