Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ ఫీవర్ కారణంగా ఇప్పటివరకు 19 పందులు చనిపోగా.. మరో 48 పందులను పశుసంవర్ధక శాఖ అధికారులు బలవంతంగా చంపేశారు. ఈ వ్యాధి కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో పంది మాంసం విక్రయాలను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. కొట్టాయం జిల్లాలోని ఓ ప్రయివేటు పందుల ఫారంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదవడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆఫ్రికన్ స్వైన్ వైరస్ మనుషులకు సోకదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తొలి కేసు అక్టోబర్ 13 న నమోదైనట్లు సమాచారం.