Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షామ్లి: ఉత్తరప్రదేశ్ లో షామ్లి జిల్లాలో 2.3 అడుగుల ఎత్తు గల వ్యక్తి అజీం మన్సూరీ పెండ్లి చేసుకోవాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. అయితే అతని తగిన వధువు ఇంతవరకు దొరకలేదు. వధువును వెతికి పెట్టమంటూ పలువురు రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాడు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను సైతం కలిశాడు. ఎట్టకేలకు ఇప్పుడు అతను పెండ్లి చేసుకోబోతున్నాడు.
చాలా సంవత్సరాల పోరాటం తర్వాత హాపూర్ గ్రామంలో అతనికి వధువు దొరికింది.
గతేడాది మార్చిలో 3 అడుగుల పొడవు గల బుషారా అనే యువతిని కలిశాడు. ఆ ఏడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరిగింది. బుషారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాతే పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ నవంబర్ 7వ తేదీన వీరి పెండ్లి జరగనుంది. పెండ్లికి ముఖ్య అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, , ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను ఆహ్వానించనున్నాడు.