Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలంలోని బిటిఎస్ చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం రామాయంపేట నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న బస్సులో నుండి ఓ మహిళ దిగి రోడ్డు దాటుతుండగా ఆమెను రామాయంపేట నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం మహిళలను ఢీట్టింది. దాంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. మహిళను ఢీ కొట్టిన ద్విచక్ర వాహన వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణించిన మహిళ దోమకొండ మండలానికి చెందిన గంగమ్మ (55) గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్ తెలిపారు.