Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంగళగిరిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలపడం తెలిసిందే. ఈ తీర్మానాలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అరాచకం సృష్టించినవారిని అభినందిస్తూ తీర్మానం చేశారని విమర్శించారు. మహిళలపై దాడులు చేసేవారికి మద్దతిస్తూ తీర్మానం చేస్తారా? అని మండిపడ్డారు. పవన్ ముందస్తు అనుమతి తీసుకోకుండానే విశాఖలో ర్యాలీ చేశారని పేర్ని నాని ఆరోపించారు. పవన్ ను చంద్రబాబు పరామర్శించింది మంత్రులపై దాడి చేసినందుకా? అని నిలదీశారు. చంద్రబాబు కోసం పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ముద్రగడపై దాడి సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. తుని ఘటనలో కేసులు ఎత్తివేసింది తమ ప్రభుత్వమేనని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుకు మొదట మద్దతు పలికి, ఆ తర్వాత మాట మార్చారని జనసేనపై విమర్శలు చేశారు. మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో మీ కార్యకర్తలు లేరా? అని పవన్ ను ప్రశ్నించారు.