Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఆదివారం మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో బ్రిడ్జి మీదుగా వెళుతున్న సందర్శకులు నదిలో పడిపోయారు. ఏడుగురు చనిపోయినట్లు తెలుస్తున్నది. నదిలో పడిపోయిన వారు 400 మందికి పైగా ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు. పలువురు గాయ పడ్డారు. ఈ ఘటన తెలిసిన వెంటనే పౌర, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన తెలిసిన వెంటనే పౌర, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇంతకుముందే దెబ్బ తిన్న ఈ కేబుల్ బ్రిడ్జికి రిపేర్లు చేసిన తర్వాత ఐదు రోజుల క్రితం సందర్శకుల రాకపోకలకు అనుమతించారని సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించేందుకు భారీగా అంబులెన్స్‌లను మోహరించారు. స్థానికుల సాయంతో గల్లంతైన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.