Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లాలోని తొర్రూర్ మండలం మాటేడు గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. యువకుడిది బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.