Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలో మచ్‌చ్చు నదిపై కేబిల్ బ్రిడ్జీ కుప్పకూలింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదసమయంలో బ్రిడ్జిపై ఉన్న సందర్శకులంతా నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మంది వరకు ఉన్నారని, 100 మంది వరకు నీటిలో చిక్కుకున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కొన్నేళ్లక్రితమే ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇటివలే పునరుద్ధరణ తర్వాత 5 రోజుల క్రితమే ఈ బ్రిడ్జీని పున:ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడినవారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.