Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాలకృష్ణ ముఖ్య అతిథిగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. 'గీతా ఆర్ట్స్ ను 1974లో స్థాపించారు .. ఆ ఏడాదిలోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అప్పుడు నాకు 14 ఏళ్లు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సంస్థను నిలబెదుతూ రావడం అంత తేలికైన విషయమేం కాదు. ముందు నుంచి కూడా అల్లు కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది' అని అన్నారు. ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులంతా కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే ఇది. ఈ సినిమా ట్రైలర్ చూశాను .. శిరీష్ బయటకూడా ఇంతేనా అనిపించింది. ఇక లాభం లేదు .. ఇతన్ని 'అన్ స్టాపబుల్' షోకి పిలిచి అన్ని విషయాలను బయటికి లాగుతాను. మొత్తానికి సినిమా అయితే చాలా కలర్ ఫుల్ గా ఉందనే విషయం మాత్రం అర్థమవుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ చాలా అందంగా కనిపిస్తోంది. నటన కూడా బాగా చేసిందని తెలుస్తూనే ఉంది. నా విషయానికి వస్తే నా అభిమానూలు కోరుకునే పాత్రలను చేస్తూ వెళతాను. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏ సినిమా చేయను. వాళ్లపై బలవంతంగా నా ఇష్టాలను రుద్దాలనుకోను. ఎవరికీ తగిన పాత్రలను వారు ఎంచుకుంటే, సక్సెస్ ను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక శిరీష్ చేసిన ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని చెబుతున్నాను అంటూ ముగించారు.