Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పిఎస్‌సీ గ్రావిటీ మెయిన్‌కు మరమ్మత్తులు జరపాల్సి ఉంది. నీటి లీకేజీలు అరికట్టడానికి ఈపనులు చేపట్టడం జరుగుతోంది. నవంబర్ 2 తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ గురువారం ఉదయం 6 గంటలవరకు 24 గంటల పాటు ఈపనులు కొనసాగుతాయి. దీంతో సింగూర్ ఫేజ్3 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు: జలమండలి డివిజన్ 9,15,24 డివిజన్ల పరిధిలోని బీహెచ్‌ఈఎల్ ఎంఐజీ, జీహెచ్‌ఇఎల్ ఎల్‌ఐజీ, చందానగర్, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, నల్లగండ్ల, హుడా కాలనీ, గోపన్‌పల్లి, లింగంపల్లి, గుల్‌మహర్ పార్కు, నెహ్రూ నగర్, గోపినగర్, దూబేకాలనీల్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదు. గోపాల్ నగర్, మయూరినగర్, మాదాపూర్, ఎస్‌ఎంఆర్, గోకుల్ ప్లాట్స్, మలేషియా టౌన్‌షిప్, బోరబండ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో లోప్రెషర్‌తో నీటి సరఫరా జరుగుతుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది.