Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో తీగల వంతెన కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం వేలాడే వంతెన కూలిపోవడంతో 140 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంతో పాటు ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ,ఎయిర్ ఫోర్స్, నావికా బృందాలను సహాయ చర్యల కోసం మోర్బీ వంతెన వద్ద రంగంలోకి దించారు. కొత్తగా పునర్ నిర్మించిన కేబుల్ బ్రిడ్జీని తమ అనుమతి లేకుండానే తెరిచారని మోర్బీ మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ ఝూలా చెప్పారు. మచ్చు నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని గుజరాత్ పోలీసులు చెప్పారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.