Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేవర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గురుపూజోత్సవాలు పార్టీలకు అతీతంగా జరిగాయి. అయితే, రామనాథపురం జిల్లా పసుంపొన్‌లో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రులు సెల్లూరు కె.రాజు, ఆర్బీ ఉదయకుమార్, విజయభాస్కర్, దిండిగల్ శ్రీనివాసన్, కామరాజ్, భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన వేడుకల్లో పాల్గొని తిరుగు పయనమయ్యారు. వారి కాన్వాయ్ మదురై - శివగంగై హైరోడ్డులో వైగై నదిపై వస్తుండగా మాజీ మంత్రులు విజయభాస్కర్, కామరాజ్, భాస్కరన్ కార్లు ఢీకొన్నాయి. వాటి వెనుక వస్తున్న ఇతర వాహనాలు కూడా ఢీకొన్నాయి. ఇలా మొత్తం 10 కార్లు ఢీకొనడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు మదియళగన్, జ్యోతిబసు, కళ్యాణసుందరం, మణికంఠన్, తమిళ్‌సెల్వన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ మానామదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.