Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైళ్లలో మత్తు పదార్థాలు, గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ డెబస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ హెచ్చరించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2021లో రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 1.61 కోట్ల విలువైన గంజాయి, నార్కోటిక్ వంటి పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2022 అక్టోబర్ వరకు రూ. 2.79 కోట్ల విలువైన సరుకు పట్టుకున్నామని, 30 మంది నిందితులను రైల్వేకోర్టులో హాజరు పర్చామన్నారు. ఈనెల 29న ఖమ్మంలో రైల్వే సీఐబీ/ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 18 కిలోల గంజాయి పట్టుకున్నామని తెలిపారు. సికింద్రాబాద్ మీదుగా ముంబాయి, ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు.