Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : : లైంగికదాడి బాధితులపై లైంగికదాడి జరిగిందా.. లేదా అని పరీక్షించేందుకు 'రెండు వేళ్ల పరీక్ష` (టూ ఫింగర్ టెస్ట్) నిర్వహించడం పట్ల సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధానం ఇప్పటికీ సమాజంలో కొనసాగడం దురదృష్టకరమని, ఇది జరగకుండా చూడాలని కేంద్ర, రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది.
లైంగికదాడి, హత్య కేసులో ఓ వ్యక్తిని ట్రయల్ కోర్టు దోషిగా తేల్చగా, దీన్ని ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేస్తూ నిందితుడిని విడుదల చేసింది. అయితే హైకోర్టు తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. టూ ఫింగర్ టెస్ట్ మహిళల గోప్యత, గౌరవానికి భంగకరమని దశాబ్దం క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేసింది. ఓ మహిళ శృంగారంలో చురుగ్గా ఉన్నంత మాత్రాన ఆమె లైంగికంగా యాక్టివ్‌గా ఉన్న మహిళపై రేప్ జరగదని చెప్పలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు రెండు వేళ్ల పరీక్ష్ణ నిర్వహించకుండా చూసుకోవాలని రాష్ట్రాల డీజీపీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శులను ఆదేశించింది. అలాగే పాఠ్యాంశాల నుంచి, విద్యా మెటీరియల్ నుంచి టూ ఫింగర్ టెస్ట్ అంశాన్ని తొలగించాలని ఆదేశించింది. రెండు వేళ్ల పరీక్షను నిర్వహించే ఏ వ్యక్తి అయినా దుష్ప్రవర్తనకు పాల్పడినట్టుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.