Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ అస్వస్థత కారణంగా సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. పార్టీ ఆఫీసు బ్యారర్లు, కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్ద గుమిగూడవద్దని ఎన్‌సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జె పార్టీ అధికారిక లేఖలో కోరారు. 81 ఏండ్ల పవార్ బుధవారం రోజు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిసింది. అనంతరం నవంబర్ 4-5 తేదీలలో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో పాల్గొంటారని ఆంగ్ల మీడియా తెలిపింది. అలాగే రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో నవంబర్ 8న పవార్ పాల్గొనాల్సి ఉంది.