Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి జరిగిన రూ.5.24 కోట్ల లావాదేవీలపై సమాధానం చెప్పాలని నోటీసుల్లో ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఆ డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా తనపై ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు.