Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. అసోం, త్రిపుర రాష్ట్రాల తరపున సమాధానం దాఖలు చేసేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
సీఏఏపై దాఖలైన పిటిషన్లకు సమాధానంగా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పౌరుల హక్కులపై సీఏఏ చట్టం ప్రభావం చూపదని కేంద్రం వాదించింది. పిటిషనర్ల అధికార పరిధిని కేంద్రం ప్రశ్నించింది. పిల్ ద్వారా చట్టాన్ని ప్రశ్నించలేరని తెలిపింది. ఇమ్మిగ్రేషన్ పాలసీ, పౌరసత్వం, వలసదారుల మినహాయింపునకు సంబంధించిన అంశాలు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయని కోర్టుకు కేంద్రం వివరించింది. ఈ మేరకు వాదనలు పూర్తయిన తర్వాత తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.