Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ లో చేరేందుకు కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి మూడేండ్లుగా తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీ నేతలతోనే కాదు స్వయంగా తనతో కూడా మాట్లాడారన్నారు. ఆయన చేరిక విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని... అయితే కేసీఆర్ వారిని పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించారని తెలిపారు. కోమటిరెడ్డి సోదరులకు నిలకడ ఉండదని.. మాట మీద నిలబడే నేతలు కాదని... గతంలో వైఎస్సార్‌ను, జగన్‌ను మోసం చేశారని... వారిని మనం నమ్మలేం అని కేసీఆర్ చెప్పారన్నారు. అందుకే వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇక సొంత నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీలో ఉండి మరొక పార్టీ కోసం పనిచేయడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఈ వ్యవహారం చూస్తే అర్థం అవుతోందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్ట్ బ్రదర్స్ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేయాల్సింది భారత్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ జోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. ముందు వారి పార్టీ నేతలు వేరే పార్టీల్లో చేరకుండా చూసుకోవాలని చెప్పారు.