Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ తో పొత్తు పై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పోత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఆరో రోజు షాద్ నగర్ నుంచి కొత్తూరు వరకు 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిగింది. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ తో తమకు ఎలాంటి దోస్తీ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నా తమకేమీ అభ్యంతరంలేదన్నారు. కేసీఆర్ అంతర్జాతీయ పార్టీ స్థాపించి చైనాలో కూడా పోటీ చేయొచ్చని చెప్పారు. అయితే రెండు సిద్ధాంతాల మధ్యే పోటీ జరుగుతోందని తెలిపారు. దేశాన్ని విడగొట్టే వాళ్ళు, జోడించే వాళ్ల మధ్యే పోటీ జరుగుతోందన్నారు. విపక్షాల మధ్య ఐక్యత రావాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందిస్తూ, ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీజేపీ , టీఆర్‌ఎస్‌లు దోచుకునే పనిలో ఉన్నాయని అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. అందుకే యువకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని అన్నారు. గతంలో తన తండ్రి రాజీవ్ గాంధీ చార్మినార్ నుంచి యాత్ర చేశారని, ఇప్పుడు అక్కడి నుంచి తాను భారత్ జోడో యాత్ర చేస్తున్నానని వివరించారు.