Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మద్యానికి బానిసై డబ్బుల కోసం వేధిస్తున్నాడని కన్న కొడుకును తల్లిదండ్రులు హత్య చేయించిన ఘటన సూర్యాపేటలో జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. రామ్ సింగ్, రాణి బాయ్ దంపతుల కొడుకు సాయినాథ్ (26) మద్యానికి బానిసయ్యాడు. అంతేకాకుండా రోజు తాగివచ్చి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. దాంతో కొడుకు ప్రవర్తనతో తల్లిదండ్రులు విసిగిపోయారు. కిరాయి హంతకులకు రూ.8 లక్షలు సుపారీ ఇచ్చి కొడుకును చంపాలని చెప్పారు. ఈ మేరకు కిరాయి హంతకులు ఈ నెల 18న మిర్యాలగూడ మండలం కల్లేపల్లి మైసమ్మ ఆలయం వద్ద సాయినాథ్‌కు మద్యం తాగించి... ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పాలకీడు మండలం శూన్య పహాడ్ వద్ద మూసీ నదిలో పడేశారు. 19వ తేదీన మృతదేహం బయటపడడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తల్లిదండ్రులు సహా ఏడుగురిని అరెస్టు చేశారు. అలాగే హత్యకు వినియోగించిన 4 కార్లు, బైక్, ప్లాస్టిక్ తాడు, రూ.23,500 నగదును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి తెలిపారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.