Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 క్రికెట్ ప్రపంచకప్ ముగియగానే భారత జట్టు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో వరుస సిరీస్ లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో టీమిండియాకు భారత్ ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అలాగే న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా ధావన్ వ్యవహరించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఇక బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వన్డే, టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు కూడా అందుబాటులోకి రానున్నారు.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సుర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్,మొహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, సుర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యజువేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్ దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.
బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , వీశీష్ట్రస. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.