Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణ పరిణామాలపై చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీపీఐ(ఎం) ఖండించింది. ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలను కాపాడేందుకు కలిసొచ్చే వారిని సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాలని కేంద్ర కమిటీ ఈ సందర్భంగా భావించింది. సమావేశంలో పాల్గొన్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ..
ప్రాంతీయ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేయాలని చేస్తోందని, నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎర వేయాలని చూసిందని తెలిపారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలో ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేనట్లు బీజేపీ వ్యవహరిస్తుందని, ఎన్నికల్లో ఎవరు గెలిచినా డబ్బుతో కొనుగోలు చేయొచ్చని బీజేపీ భావిస్తోందని మండిపడ్డారు. గవర్నర్లు, డబ్బుని వినియోగిస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా బీజేపీ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.