Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సెప్టెంబర్‌లో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో భారతీ ఎయిర్‌టెల్ 89 శాతం వృద్థితో ఏకంగా రూ.2,145 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 22 శాతం పెరిగి రూ.34,527 కోట్లుగా నమోదయ్యింది. ప్రతీ వినియోగదారుడి నుంచి సగటు రాబడి 24 శాతం పెరిగి రూ.190గా చోటు చేసుకుంది. క్రితం క్యూ2లో రిలయన్స్ జియో లాభాలు 28 శాతం పెరిగి రూ.4,518 కోట్లకు చేరిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ కూడా 20.2 శాతం ఎగిసి రూ.22,521 కోట్లుగా చోటు చేసుకుంది.